AP: టమాటా ధరలు భారీగా తగ్గాయి. దాంతో అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కేజీల టమాటా ధర రూ.150 మాత్రమే పలుకుతోంది. కేజీ టమాటా ధర రూ.10గా ఉంది. గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో రైతులు పంటను కోయకుండానే వదిలేస్తున్నారు. పంట దిగుబడి పెరగడంతో ధరలు తగ్గినట్లు సమాచారం. అటు హైదరాబాద్‌లోని హోల్ సేల్ మార్కెట్‌లలో రూ.100కు 6-7 కిలోల టమాటాలు విక్రయిస్తున్నారు.