వారం రోజుల్లో టమాటా ధర రెట్టింపు

రాష్ట్రవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. మదనపల్లె మార్కెట్లో మొదటి గ్రేడ్ టమోటాలు 10 కిలోలు రూ.610కు, రెండవ గ్రేడ్ రూ.480కు అమ్ముడయ్యాయి. వారం క్రితం ఇదే రకం రూ.440, రూ.340కు లభించింది. మార్కెట్ రాకపోకలు 140 మెట్రిక్ టన్నులకు తగ్గాయి. పట్టణాల్లో కిలో రూ.65-80కి చేరాయి. తుఫాను, నిరంతర వర్షాల వల్ల సరఫరా తగ్గడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్