ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహర్షి వేదవ్యాసుడు ఇదే రోజున జన్మించడంతో దీనికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే గురుపౌర్ణమి రోజున గురువులను, తల్లిదండ్రులను పూజించడం మన ఆనవాయితీగా వస్తోంది. వేదవ్యాసుడు మన తొలి గురువు కాబట్టి ఆయనను స్మరించుకుంటూ గురువులను పూజించాలి. చదువులో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు, మనసులో గందరగోళం ఉన్న విద్యార్థులు, ఈ రోజున భగవద్గీత పఠించడం మంచిది.