పౌర్ణమి తిథిరోజున కొన్ని పనులు చేస్తే శుభం జరుగుతుందని నమ్మకం. మార్గశిర పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తం దైవిక శక్తితో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. గీతలో శ్రీకృష్ణుడే మార్గశిర మాసాన్ని అభివర్ణించాడని, అందుకే ఈ పూర్ణిమను మహా పూర్ణిమ అంటారని చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 4న, గురువారం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి, ధ్యానం, దానం చేయడం వల్ల జీవితంలో శుభాలు జరుగుతాయని నమ్మకం. స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసి, ఆ నీటిని తలపై చల్లుకుని నమస్కరించాలని సూచిస్తున్నారు.