దేశంలో చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందించే 'ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన' 20వ విడత నిధులు ఆగస్టు 2న విడుదల కానున్నాయి. రూ.2,000 చొప్పున 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ఆర్థిక సహాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా.. e-KYC పూర్తి చేసి, భూమి రికార్డుల ధృవీకరణను కలిగి ఉండాలి. ఈ ప్రక్రియలను పూర్తి చేయని రైతులు 20వ విడత డబ్బులు పొందలేరు.