ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే గురువారం.. ఏలూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్