మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు

TG: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెద్దఎత్తున సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జేపీ నడ్డా, ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్‌లో అమిత్ షా పాల్గొనే సభలు జరిగే అవకాశం ఉంది. ఈ సభల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్