ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి రూ.60 వేలలోపు మంచి రేంజ్, టాప్ స్పీడ్ అందించే స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. నగర ప్రయాణాలకు ఇవి అనుకూలం. ఓలా S1 X గంటకు 90 కిమీ వేగంతో, 108 కిమీ రేంజ్‌తో వస్తోంది. హీరో మోటోకార్ప్ Vida VX2 Go రూ.44,990 ధరతో 92 కిమీ రేంజ్, 70 కిమీ వేగంతో లభిస్తోంది. టీవీఎస్ Orbiter V1 రూ.49,999 ధరతో 86 కిమీ రేంజ్, 68 కిమీ వేగంతో ఉంది. జెలియో గ్రేసీ i రూ.54,000 ధరతో 70 కిమీ రేంజ్, 65 కిమీ వేగంతో, బౌన్స్ ఇన్ఫినిటీ E1 రూ.55,000 ధరతో 70 కిమీ రేంజ్, 65 కిమీ వేగంతో అందుబాటులో ఉన్నాయి.