టాప్‌గన్‌ నటుడు టామ్‌ స్కెరిట్‌ మృతి

హాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు టామ్ స్కెరిట్(93) కన్నుమూశారు. బుధవారం తన కుటుంబ సభ్యులు అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌లో ఉన్న తన నివాసంలో సహజ కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1986లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం 'టాప్ గన్'లో కమాండర్ మైక్ 'వైపర్' మెట్‌కాఫ్ పాత్రతో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అలాగే 'ఏలియన్' చిత్రంలో కెప్టెన్ డల్లాస్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను అలరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕