డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా

మావోయిస్టు పార్టీ కీలక నేత, గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా, తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. మావో అధినేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత సాయుధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. బర్సే దేవపై ప్రభుత్వం 50 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించింది. అతని లొంగుబాటు అంతర్గత భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. మాంటేయిన్ LMG తుపాకీతో పాటు మరిన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేపు (శనివారం) బర్సే దేవాను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్