ఏపీలో కుండపోత వర్షం (వీడియో)

AP: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. తిరుపతి, తూ.గో.జిల్లా సీతానగరం, నెల్లూరు జిల్లా కలువాయి మండలం, వైఎస్సార్ జిల్లా, పల్నాడు జిల్లా నూజెండ్ల, రొంపిచర్ల మండలాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్