TG: టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో 27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా చోటు లభించింది. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, వంశీ కృష్ణా, నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, పర్ణికా రెడ్డి, మట్టా రాఘవయ్య తదితరులకు కార్యవర్గంలో చోటు దక్కింది.