నేడు టీపీసీసీ పీఏసీ, అడ్వయిజరీ కమిటీల భేటీ

తెలంగాణలో ప్రారంభంకానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై చర్చించేందుకు నేడు (శుక్రవారం) గాంధీభవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉదయం నుంచి బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. SIR ప్రక్రియలో పాటించాల్సిన అంశాలు, పార్టీ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం సాయంత్రం పీఏసీ, అడ్వైజరీ కమిటీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సహా సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్