హోలీ పండుగ సందర్భంగా TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన మిత్రులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి సంబరాల్లో మునిగిపోయారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులో డీజీ టిల్లు పాటకు స్టెప్పులేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రామ్ మందిర్ కమాన్ వద్ద జరిగిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఆయన తన మిత్రులతో కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.