రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్‌లో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ట్రాక్టర్ స్వల్పంగా దెబ్బతింది.