చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

TG: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ చెరువు కట్టపై ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప చువ్వల లోడుతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్ళి బోల్తా పడింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఈ దుర్ఘటనకు అసలు కారణాలు ఏమిటనే విషయాలపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕