ట్రాఫిక్ చలానాల రాయితీలు.. ఫేక్ న్యూస్: సీపీ సజ్జనార్

TG: సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా SMలో వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేశారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలానాల రాయితీలు పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీలను ప్రకటించలేదని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్