విషాదం.. 13 ఏళ్ల బాలుడు దారుణ హత్య

బెంగళూరులో 13 ఏళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. బుధవారం ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు నిశ్చిత్ తిరిగి ఇంటికి రాలేదు. అయితే, బాలుడిని కిడ్నాప్ చేశామని, రూ. 5 లక్షలు ఇస్తే వదిలిపెడతామని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. వెంటనే బాలుడి తండ్రి హులిమావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గాలింపు ప్రారంభించిన పోలీసులు గురువారం కగ్గలిపురలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు.

సంబంధిత పోస్ట్