TG: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని మంజీర ట్రినిటీ హోమ్స్‌లో 17వ అంతస్తు నుంచి దూకి 13 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నారాయణ స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న లాస్య ప్రియ (13) బాగా చదవడం లేదని టీచర్స్ చెప్పడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. మనస్థాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. కింద ఉన్న పదునైన భాగంపై లాస్య పడటంతో ఆమె ఎడమ కాలు శరీరం నుంచి వేరయింది.