హైదరాబాద్‌కు చెందిన అఖిల్‌పాష (42) అనే వ్యక్తి, ఆదివారం జరిగిన సమీప బంధువు వివాహ వేడుకలకు హాజరయ్యారు. సోమవారం పరిగిలో జరిగిన డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు. అనంతరం బురాన్‌పూర్ గ్రామానికి చేరుకున్నారు. హోలీ ఆడిన తర్వాత బంధువులతో కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా, అఖిల్‌పాష చెరువులోని లోతైన గుంతలో మునిగిపోయి మృతి చెందాడు. ఈత రాకపోవడమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.