మెక్సికోలోని త్లాక్సాలా స్టేట్లో జరుగుతున్న వరల్డ్ లార్జెస్ట్ ఓపెన్ రోడ్ బుల్ ఫైటింగ్ ఈవెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్లో ఎద్దు దాడి చేయడంతో 29 ఏళ్ల యువకుడు మృతి చెందారు. మరో 9 మంది గాయాలపాలయ్యారు. ఈ వార్షిక ఈవెంట్ జులై చివరి నుంచి ఆగస్టు చివరి వరకు నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ ఈవెంట్లో భాగంగా బారికేడ్లతో మూసివేసిన వీధుల గుండా ఎద్దులను వదులుతారు, ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది.