మేడారం జాతరలో విషాదం.. జంపన్న వాగులో కొట్టుకుపోయి భక్తుడు మృతి

TG: మేడారం జాతరలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బీమారానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ (54) కుటుంబంతో కలిసి జాతరకు వచ్చి, జంపన్న వాగులో స్నానం చేస్తుండగా వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. జాతర మొదటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. వాగులో అడుగున ఇసుక లోతులు, హెచ్చుతగ్గులు సరిచేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్