ఈజిప్టులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హుర్ఘాడాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ రిసార్ట్‌లో జరుగుతున్న స్నేక్ షోలో పాముకాటుకు గురై ఒక జర్మన్ పర్యాటకుడు మృతి చెందాడు. స్నేక్ షో నిర్వాహకుడు ప్రేక్షకుల మెడలో పాములను వేస్తూ విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో ఒక పామును నెమ్మదిగా ఆ పర్యాటకుని ప్యాంటులోకి జారవిడిచాడు. అది కాలిపై కరవడంతో విషం ఎక్కి ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనతో అక్కడి పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై జర్మనీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.