మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఇంట విషాదం

TG: బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు రాథోడ్ నర్సింగ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టైలర్స్ కాలనీలో గుండెపోటుతో మృతి చెందారు. రాథోడ్ నర్సింగ్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్