AP: అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని బోయినపల్లి ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కనపర్తి కీర్తి రెడ్డి (21) అనే యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీర్తి ఉరి వేసుకుని కనిపించడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.