AP: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన సుబరి బంధు, రాజకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. జీవనోపాధి కోసం బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో నివసిస్తున్నారు. చిన్న కుమార్తె మానస (18 నెలలు) ఇంటి బయట ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ నీటి టబ్‌లో పడిపోయింది. నీటి టబ్‌లో అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.