AP: నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.