ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. డివైన్ పబ్లిక్ స్కూల్లో ఒక విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్, దాని వైబ్రేషన్ల వల్లే విద్యార్థిని అస్వస్థతకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి శబ్ద పరిమితులు ఉల్లంఘించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.