శ్రీశైలం పాదయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన భక్తుడు విజయ్‌కుమార్ బరాది (38) ఎండ వేడిమిని తట్టుకోలేక మృతి చెందాడు. ఆయన పాదయాత్రగా శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి ఆత్మకూరు మండలం కృష్ణాపురం వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు గమనించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.