విషాదం.. నదిలో మునిగి ఎనిమిది మంది మృతి (వీడియో)

రాజస్థాన్‌లోని టోంక్‌ జిల్లాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవులు కావడంతో బనాస్‌ నదిలో ఈత కొడదామని 11 మంది దిగారు. ఈ క్రమంలో 8 మంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతులు జైపూర్ నివాసితులు అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్