విషాదం.. చెరువు తూములో ఇరుక్కొని రైతు మృతి

TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మాటేడు గ్రామ పరిధిలోని బండ మీది తండాకు చెందిన జాటోత్ నరేష్(40) చెరువు తూములో ఇరుక్కొని మృతి చెందాడు. ఎస్సై ఉపేందర్ వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం తమ పొలంలో నారుమడి దున్నుటకు నీరు పెట్టడానికి వెళ్లారు. నీరు రాకపోవడంతో మాటేడు పెద్ద చెరువు బొంతుపల్లి తూము వద్దకు వెళ్లి.. అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించేందుకు నరేష్ తూములోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ తూములో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్