విషాదం.. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు

ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో నాలుగురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు సోదరులు అని పోలీసులు తెలిపారు. వారందరూ ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారని, ఊపిరాడక మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్