విషాదం.. అగ్నిగుండంలో పడి చనిపోయాడు!

కర్ణాటకలోని రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేడుకల కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి హనుమంత్ అనే 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఊరేగింపులో పరిగెడుతుండగా అతడు తడబడి అగ్నిగుండులో పడిపోయాడు. తీవ్రంగా కాలిపోయిన హనుమంత్‌ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్