AP: విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న చంద్ర, సీత మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సు చంద్రను ఢీకొట్టింది. కింద పడిపోయిన చంద్ర తల పైనుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అతను స్పాట్లో మృతి చెందారు. భార్య సీత కళ్ల ముందే చంద్ర తుదిశ్వాస విడిచారు. దాంతో భార్య గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.