AP: పల్నాడు జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మీ లుగా పోలీసులు గుర్తించారు. స్థానికులు యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.