నీటి టబ్‌లో పడి 18 నెలల చిన్నారి మృతి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో శనివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి సుబరి మానస ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్‌లో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు ఫ్యాన్ రిపేర్‌లో నిమగ్నమవ్వడంతో, అక్కలు నిద్రపోవడంతో చిన్నారిని గమనించలేకపోయారని వివరించారు. కుటుంబం జీవనోపాధి కోసం ఒడిశా నుంచి వలస వచ్చి పామాయిల్ తోటలో కూలీ పనులు చేస్తోంది. చిన్నారిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్