చిత్తూరులో విషాదం.. ఇద్దరు నవజాత శిశువుల మృతి

AP: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు నవజాత శిశువులు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రసవం కోసం చేరిన తల్లులకు జన్మించిన కొద్దిసేపటికే శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువులు మరణించారని ఆరోపించారు. సరైన వైద్యం అందకపోవడమే ఈ దారుణానికి కారణమని ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕