TG: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న శ్రీ హిందూ అనే విద్యార్థిని పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గత నాలుగు రోజుల క్రితం పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటనలతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న సిబ్బంది మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఆదివారం విద్యార్థిని మృతి చెందింది. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.