నల్గొండ జిల్లా కనగల్ మండలం ఖాజీరామారంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన గుండు సాయిచరణ్ (10), మధు (9) అనే ఇద్దరు స్నేహితులు ప్రమాదవశాత్తు గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. శనివారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో, వెతుకుతున్న క్రమంలో ఆదివారం బావి వద్ద వారి చెప్పులు కనిపించాయి. బావిలో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.