నేపాల్‌లోని హిమ్‌లుంగ్ హిమాల్ పర్వత బేస్ క్యాంప్‌పై సెప్టెంబర్ 27న సంభవించిన ఘోర హిమపాతం ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. విదేశీ పర్వతారోహకుల కోసం బేస్ క్యాంప్ సిద్ధం చేయడానికి వెళ్లిన నేపాల్ స్థానిక గైడ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్ ఈ ప్రమాదంలో మరణించారు. బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో కురిసిన భారీ వర్షాలు, హిమపాతం దీనికి కారణమని తెలుస్తోంది. గల్లంతైన 16 మందిలో 15 మంది మృతదేహాలను వెలికితీయగా, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.