క్షణికావేశం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. అప్పటివరకు మాట్లాడుతూ కనిపించిన వ్యక్తులు రెప్పపాటులో ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్‌లోని చిక్కడపల్లి హరినగర్‌లో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన సనా బేగం (24) ఐదో అంతస్తు టెర్రస్‌పైకి చేరుకుంది. ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.