తిరుమలలో విషాదం.. భవనం పైనుంచి పడి మూడేళ్ల బాలుడి మృతి

AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనం రెండో అంతస్తు పైనుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్ (3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.

సంబంధిత పోస్ట్