TG: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంకు చెందిన బానోత్ మణిచంద్ర (22) ఈ నెల 17న తన తండ్రితో కలిసి వెళ్తున్న క్రమంలో కూసుమంచిలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో మృతిచెందాడు. చనిపోయిన మరుసటి రోజే అతను సీఆర్పీఎఫ్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. ఉద్యోగం వచ్చినా, మణిచంద్ర అది చూడకుండానే కన్నుమూశాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.