TG: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సిరిపూర్ గ్రామానికి చెందిన ఒల్లెపు శృతి(19) పాత దామరాజ్పల్లి గ్రామానికి చెందిన మక్కల సాయికుమార్(23)లు ప్రేమించుకున్నారు. ఏడు నెలల క్రితం వీరి నిశ్చితార్థం జరిగింది. ఉపాధి నిమిత్తం బెహరిన్ వెళ్లిన సాయికుమార్ శుక్రవారం అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలిసి మనస్తాపానికి గురైన శృతి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.