AP: నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం శిరసనంబేడులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గొర్రెల కాపరి సిద్ధార్థ్ (48) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అకాల వర్షాలు కురుస్తుండటంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.