విషాదం.. బావిలో దూకి తల్లీకొడుకులు మృతి (వీడియో)

AP: విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో మంగళవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. సత్తివానిపాలెంలో నివాసముంటున్న గీత (30).. కూతురు యోక్షిత (8), కొడుకు మణికంఠ (7)తో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందగా.. కూతురు యోక్షిత ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్