విషాదం.. చెక్ డ్యామ్‌లో పడి ముగ్గురు మృతి

TG: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలోని చెక్ డ్యామ్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లీ కొడుకు ఉన్నారు. స్నానానికి వెళ్లిన కుమార్ (12), బిర్జు (6) మునిగిపోగా.. ఈ ఇద్దరిని రక్షించబోయి ఉమాదేవి (32) గల్లంతయ్యారు. బిహార్ నుంచి 5 రోజుల కిందటే రెండు కుటుంబాలు బతుకుదెరువు కోసం కస్తూరిపల్లికి వచ్చారు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్