AP: తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు బాలురు చేసిన పని ఆ ఇంట విషాదాన్ని నింపాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని నాగదేవత కాలనీలో నివాసముంటున్న కుమార సాయి, నాగులమ్మ దంపతులకు అసబ్ (11), బాబి (7) ఇద్దరు కుమారులు. ఇంట్లో ఉన్న పిల్లలు టపాసులు అంటించారు. ఆ టపాసు చేతిలో పేలిపోయి బాబికి చేయి మణికట్టు వరకు తెగిపోయింది. అసబ్ కాలుకు గాయాలయ్యాయి. పిల్లలను నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.