అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన జమిల్ లిమోన్, నహీదా బ్రిస్టీలు గత వారం అదృశ్యమయ్యారు. వీరిద్దరూ హత్యకు గురైనట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో విద్యార్థి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. వీరికి తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.