విషాదం నింపిన పారాగ్లైడింగ్.. టూరిస్ట్‌ దుర్మరణం

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల సమీపంలో జరిగిన పారాగ్లైడింగ్‌ ప్రమాదంలో బల్గేరియా పౌరుడు మాక్సిమ్‌ వాలెంటినోవిచ్‌ గావ్రిలిచెంకో మృతి చెందగా, స్టీఫెన్‌ ఆంటోనీ గాయపడ్డారు. బిర్‌ బిల్లింగ్‌ నుంచి పారాగ్లైడింగ్‌ చేస్తుండగా 2,700 మీటర్ల ఎత్తులో ఈదురు గాలుల కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సహాయక బృందాలు రాత్రంతా గాలించి, స్టీఫెన్‌ను హెలికాప్టర్‌ ద్వారా సురక్షితంగా తరలించాయి. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕